తెలంగాణలో రాబోయేది భాజాపానే : లక్ష్మణ్

తెలంగాణలో కాషాయజెండా ఎగరడం ఖాయం అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన అయోధ్య తీర్పుపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడంపై సటైర్ వేశాడు. రామమందిరం నిర్మాణానికి సానుకూల పరిష్కారం లభించినా..  యజ్ఞాలు, యాగాలు చేసే వారు మాత్రం నీరు మెదపడం లేదు అన్నారు.కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగు చెందారు. బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఈ రోజు కేసీఆర్ పాలన నుంచి విముక్తి కోసం మళ్లీ బలిదానాలు జరుగుతున్నాయి అన్నారు లక్ష్మణ్.

ప్రధాని నరేంద్ర మోడీ కారణజన్ముడని ఇటీవల లక్ష్మణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ప్రధానిపై ప్రశంసలు గుప్పించారు. 370 ఆర్టికల్ రద్దు ద్వారా రావణకాష్టంగా రగులుతున్న 70 ఏళ్ల కశ్మీర్ సమస్యని ప్రధాని మోదీ శాశ్వతంగా పరిష్కరించారు. ఇప్పుడు 134యేళ్ల అయోధ్య సమస్యకు సైతం సామరస్య పరిష్కారం చూపారని లక్ష్మణ్ అన్నారు. దేశం మ్మొత్తం కాషాయ జెండా ఎగురుతుంది. భవిష్యత్ లోనూ తెలంగాణలో భాజాపాదే అధికారం అన్నారు లక్ష్మణ్.