రామ్ చరణ్ గర్జిస్తున్నాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోర్టు బోనులో గర్జిస్తున్నాడు. ఆంగ్లేయుల ఆగడాలని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.

న్యాయస్థానం నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. బ్రిటిష్ న్యాయస్థానం ముందు అల్లూరి సీతారామరాజుని హాజరు పరిచిన నేపథ్యంలోని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఆ సన్నివేశాలు రొమాలు నిక్కబొటిచేలా ఉంటాయని చెబుతున్నారు. మన్యం ప్రజల కోసం బ్రిటిష్ న్యాయస్థానంలో చరణ్ గర్జన ఏ రేంజ్ లో ఉండబోతుందని చూడటానికి వచ్చే యేడాది జులై 30 వరకు ఆగాల్సిందే.