విశాల్ ‘యాక్షన్’ ఎలా ఉందంటే.. ?

కోలీవుడ్ హీరో విశాల్ యాక్షన్ లోకి దిగిపోయాడు. సి. సుందర్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘యాక్షన్’. తమన్నా కథానాయిక. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘యాక్షన్’ ఫస్ట్ షో పూర్తయింది. విశాల్ యాక్షన్ అదిరిపోయింది. 

ఫస్టాఫ్ బాగుంది. దర్శకుడు సి. సుందర్ ఈసారి డిఫరెంట్ గా ట్రై చేశారు. బోల్డ్ అండ్ సన్సేషనల్ స్క్రిప్ట్ ని రాసుకొన్నారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాస్ ఏపీసోడ్స్ అదిరిపోయాయ్. హాలీవుడ్ సినిమా చూస్తున్న రేంజ్ లో యాక్షన్ ఉంది. తమన్నా కూడా యాక్షన్ తో అదరగొట్టేసింది. గ్లామర్ గా కనిపించింది. ఐతే, పాటలు కథకి అడ్డంగా అనిపించాయి. మొత్తానికి.. విశాల్-తమన్నాల ‘యాక్షన్’  అదిరిపోయింది. యాక్షన్ ప్రియులకి విందు భోజనమే.