కారు ఉన్నవాళ్లకి కూడా ఆరోగ్యశ్రీ వర్థింపు

ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం విస్తరణకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథక పరిధిని భారీగా పెంచింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అంతేకాదు.. కారు ఉన్నవారు కూడా  ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. ఐతే, కుటుంబంలో ఒకకారు ఉన్నవారికి మాత్రమే అర్హులు. రెండు కార్లు ఉంటే గనకు అనర్హులు. రేషన్ కార్డులు, వైఎస్సార్ పింఛన్ కార్డు, జగనన్న విద్య అర్హత ఉన్న కుటుంబాలూ ఈ పథకానికి అర్హులు.

 12 ఎకరాల కన్నా తక్కువ మాగాణీ లేక 35 ఎకరాల కన్నా తక్కువ మెట్ట భూమి ఉన్న భూ యజమానులూ ఆరోగ్య శ్రీ ఫలాలు పొందవచ్చు. ప్రభుత్వ రంగంలో పని చేస్తూ గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ పథకాన్ని.. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కూడా అమలు చేసింది. ఇప్పుడీ పథకాన్ని సీఎం జగన్ మరింతగా విస్తరించారు. దానివలన మరింత మందికి ఆరోగ్య శ్రీ ద్వారా లబ్ధి చేకూరనుంది.