కార్తీ.. మరో మెగాస్టార్ టైటిల్ ని ‘దొంగ’లించాడు !

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ’ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ కొట్టాడు తమిళ్ హీరో కార్తీ. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కార్తీ’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా రూ. 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటికీ కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. ఖైదీ కథ-కథనం అద్భుతంగా కుదిరాయి. ముఖ్యంగా హీరోయిన్, పాటలు లేకుండా కార్తీ చేసిన ప్రయోగం ఫలించింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకొన్నాడు. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ కావడంతో సినిమా ఈజీగా ప్రేక్షకుల్లోకి వెళ్లింది. 

ఇప్పుడు  మరో మెగాస్టార్ టైటిల్ ని కార్తీ దొంగలించాడు. కార్తీ, ఆయన వదైన అయిన సీనియర్ హీరోయిన్ జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘తంబి’. ఈ చిత్రానికి జీతు జోసెఫ్‌ దర్శకుడు. ఈ సినిమా తెలుగు టైటిల్ ని ‘దొంగ’గా నిర్ణయించారు. గతంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’ సినిమా చేయడం విశేషం. ఇప్పుడు కార్తీ కూడా ఖైదీ సినిమా తర్వాత దొంగ సినిమా చేస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.