పొలం పనులు చేస్తున్న హీరోయిన్

గ్లామర్ హీరోయిన్ పొలం పనులు చేస్తోంది. బుడద మడిలోకి దిగి వరినాట్లు వేస్తోంది. దానికి సంబంధిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లామర్ హీరోయిన్ పొలం పనులు చేయడమేంటీ ? అని చర్చించుకొంటున్నారు. ఇంతకీ ఆ గ్లామర్ హీరోయిన్ ఎవరో తెలుసా ? అందాల నిధి. నిధి అగర్వాల్. సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ. 

ఆ తర్వాత మిస్టర్ మజ్ఝ్ను సినిమా చేసింది. ఈ రెండు ఆమెకి నిరాశనే మిగిల్చాయి. ఇక ఇస్మార్ట్ శంకర్ ఆమె హిట్ కోరికని తీర్చింది. నిండైన అందాల నిధి గ్లామర్ రోల్స్ కి ఫర్ ఫెక్ట్. కానీ, ఆమె అచ్చం పల్లెటూరు పిల్లలా మారింది. పొలం పనులు చేస్తోంది. కోలీవుడ్ హీరో జయం రవి 25వ సినిమాగా భూమి సినిమా తెరెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి లక్ష్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పోస్ఘర్ వచ్చేసింది. ఇందులో జయం రవి, నిధి బుడదమడిలో వరి నాటు వేస్తున్నారు. ఇది చూసి.. గ్లామర్ హీరోయిన్ పొలం పనులు చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.