ఆర్టీసీ జేఏసీ నేతలు అమ్ముడుపోయారా ?
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఇంకా కొనసాగుతోంది. ఐతే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ విషయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు వెనక్కి తగ్గారు. మిగిలిన డిమాండ్స్ అయినా ప్రభుత్వం పరిష్కరిస్తే బాగుండు అనే స్థితికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలపైనే పోలీసులకి ఫిర్యాదు చేశాడు మాల మహానాడు అధ్యక్షుడు దీపక్ కుమార్. ఇంతవరకు ఉదృతంగా సాగిన సమ్మెను.. జేఏసీ నేతలు నీరుగార్చుతున్నారని దీపక్ కుమార్ ఆరోపించారు.
23 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నాక.. విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారన్న అనుమానం కలుగుతుందన్నారు. దాదాపు 50,000 మంది ఆర్టీసీ ఉద్కోగులు, కార్మికులు తన జీతభత్యాలను వదులుకోని, అనేక కష్టాలకోర్చి సమ్మె చేస్తుంటే.. ఉద్యమ నేతలు తీరు బాధ కల్గిస్తుందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రభుత్వానికి అమ్ముడుపోయారనే విధంగా దీపక్ కుమర్ మాట్లాడారు. మరీ.. అందులో నిజం ఉందా ? అనేది ఆ దేవుడికే తెలియాలి.