ఆ లోటు తీర్చడం రజనీకి మాత్రమే సాధ్యం !

తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇది మేధావుల మాట. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యత స్పష్టంగా కనిపిస్తుందని మేధావి వర్గాలు అంటున్నాయి. ఐతే, ఆ శూన్యాన్ని భర్తీ చేయగలిగి సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రమేనని మాజీ కేంద్ర మంత్రి అలగిరి అన్నారు. శుక్రవారం చెన్నై విమానాశ్రయంలో అలగిరి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతపై స్పందించారు. తమిళనాడులో నాయకత్వ లోటు కనిపిస్తోందన్న విషయం నిజమే. రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేసిఅ రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తారు’ అన్నారు. మరీ.. డీఎంకే పార్టీ గురించి అడగగా..  ప్రస్తుతం తాను ఆ పార్టీలో లేను.  ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఇక రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేసిన రజనీకాంత్.. ఇంత వరకు పార్టీ పేరు, జెండా, అజెండాని ప్రకటించలేదు. ఆయన వచ్చే యేడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలని మాత్రమే టార్గెట్ గా పెట్టుకొన్నారు. ప్రస్తుతం మంచి రాజకీయ వ్యూహాకర్త కోసం రజనీ వెతుకుతున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. దర్భార్ సినిమాని పూర్తి చేసిన రజనీ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.