‘రూలర్’ ఆ డేటుకి ఫిక్సయ్యాడు

నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా ‘రూలర్’. సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా రూలర్ రిలీజ్ డేటు డిసెంబర్ 20కి ఫిక్సయింది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. రిలీజ్ డేటుతో కూడిన పోస్టర్ ని విడుదల చేసింది. ఇందులో బాలయ్య స్టయిలీష్  లుక్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య కొత్త లుక్ లోకి మారిపోయాడు. 

ఇక డిసెంబర్ 20న మెగా యంగ్ హీరో సాయి తేజు ‘ప్రతిరోజూ పండగే’ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. తేజు కి జంటగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో బాలయ్య రూలర్ పోటీపడబోతుంది. ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్ వి. ఈ నేపథ్యంలో పెద్దగా ఇబ్బంది ఉండదని అంటున్నారు. వాస్తవానికి రూలర్, ప్రతిరోజూ పండగే.. ఈ రెండు చిత్రాలు సంక్రాంతిని టార్గెట్ చేసుకొని తెరకెక్కినవే. ఐతే, సంక్రాంతికి బన్నీ, మహేష్ కూడా వస్తున్నారు. దీంతో ఇబ్బంది లేకుండా బాలయ్య, సాయి తేజు కాస్త ముందుగానే డిసెంబర్ లో వస్తున్నారు.