సాయి పల్లవి కొత్త నిర్ణయం

తెలుగు ప్రేక్షకులని ‘ఫిదా’ చేసిన సాయి పల్లవి షాకింగ్ నిర్ణయం తీసుకొంది. సినిమా ఆఫర్లు రానివారికి, సీనియర్ నటీనటులకి వెబ్ సిరీస్ లు మంచి వేదికగా మారాయి. ఐతే, హీరోయిన్ గా బిజీగా ఉన్న సాయిపల్లవి వెబ్ సిరీస్ లో నటించేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారమ్. నెట్ ఫ్లిక్స్ కు సంబంధించిన ఒక వెబ్ సిరీస్ ను ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారమ్.

ఈ వెబ్ సిరీస్ లో ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్’ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసురన్ తెలుగు రీమేక్ లో విక్టరీ వెంకటేష్ నటించబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు అసురన్ కోసం మాతృక దర్శకుడుని తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. దీంతో.. అసురన్ రిమేక్ బాధ్యతలని ఓంకార్ చేతుల్లో పెట్టినట్టు సమాచారమ్. ఇక, సాయి పల్లవితో తెరకెక్కించనున్న వెబ్ సిరీస్ లో వెట్రిమారన్ కాకుండా మరో ముగ్గురు దర్శకులు కూడా పని చేయబోతున్నారట. సుధా కొంగర, విగ్నేష్ శివన్, గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖ దర్శకులు ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ కాబోతున్నట్టు టాక్.