ట్విట్టర్ రివ్యూ : తెనాలి రామకృష్ణ

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ సారి ఆయన ప్రేక్షకులని కితకితలు పెట్టాలని డిసైడ్ అయ్యాడు. కామెడీ చిత్రాల దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ’. హన్సిక కథానాయిక. వరలక్ష్మి శరత్‌ కుమార్‌, మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌, ప్రభాస్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ నిర్మించారు.

టీజర్, ట్రైలర్ లలోనే కామెడీ డోసు ఎక్కువగానే కనిపించింది. ఇక సినిమాలో ఓ రేంజ్ లో కితకితలు పెట్టబోతున్నారని అనిపించింది. భారీ అంచనాల మధ్య ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఉదయం పూట పూర్తయింది. ట్విట్టర్ వేదికగా సినిమా టాక్ ని పంచుకొంటున్నారు. తెనాలి రామకృష్ణుడు వినోదాత్మకంగా ఉన్నాడని చెబుతున్నారు.

సినిమా స్టార్టింగ్ నుంచే నవ్వులు పూయించాడు. వినోదంతో పాటు యాక్షన్ అదిరిపోయింది. సెంటిమెంట్ కూడా వర్కవుట్ అయింది. మురళీ శర్మ ఎమోషనల్ నటన ఫ్యామిలీ ప్రేక్షకులకి కనెక్ట్ కానుంది. కర్నూలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వినోదం పాటు యాక్షన్ బాగుంది. ఫస్టాఫ్ వినోదంతోపాటు యాక్షన్ అదిరింది. ఇక సెకాంఢాఫ్ లో ఎమోషన్ ని కూడా జతచేశాడు దర్శకుడు. మొత్తంగా తెనాలి రామకృష్ణపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ ట్విట్టర్ టాక్ నే రియల్ టాక్ అయితే.. సందీప్ కిషన్ ఖాతాలో మరో హిట్ పడినట్టే.