మూడు కోడిగుడ్ల ధర రూ.1672
మీరు చదివింది నిజమే. మూడు కోడిగుడ్ల ధర రూ.1672. గతంలో ఓ స్టార్ హోటల్‌లో రెండు అరటిపండ్లకు వందల్లో బిల్లు వేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అది వైరల్ అయింది. తాజాగా ఇలాంటి సీన్ రిపీట్ అయింది. గురువారం ప్రముఖ సంగీత దర్శకుడు శేఖర్ రావ్‌జియాని గుజరాత్ అహ్మదాబాద్‌లోని హయత్ రీజెన్సీ స్టార్ హోటల్‌లో మూడు ఉడకబెట్టిన కోడిగుడ్లతో భోజనం ఆర్డర్ ఇచ్చారు. భోజనం చేసిన అనంతరం బిల్లు చూసి షాక్ అవ్వడం ఆయన వంతైంది.
ఎందుకంటే మూడు కోడిగుడ్ల ధర రూ.1672లుగా వేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో ద్వారా తెలిపారు. ఆ బిల్లులో మూడు ఉడికించిన కోడిగుడ్లకు రూ.1350, సర్వీస్ ఛార్జీగా రూ.67, సీజీఎస్టీ రూ.127, ఎస్‌జీఎస్టీ 127.. మొత్తం బిల్లు రూ.1672లుగా ఉంది. శేఖర్ బిల్లుతో సహా ట్విట్ చేయడంతో ఇప్పుడీ న్యూస్ వైరల్ అవుతోంది. స్టార్ హోటల్ అయితే అంతే మరీ.. అని నెటిజన్స్ సరదగా కామెంట్స్ చేస్తున్నారు.
Rs. 1672 for 3 egg whites???
That was an Eggxorbitant mealpic.twitter.com/YJwHlBVoiR
— Shekhar Ravjianii (@ShekharRavjiani) November 14, 2019