తెదేపా నుంచి వంశీ సస్పెండ్

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తెదేపా అధినేత చంద్రబాబు యాక్షన్ తీసుకొన్నారు. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇటీవలే వంశీ తెదేపా పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పార్టీపై పెద్దగా ఆరోపణలు చేయని.. వంశీ గురువారం తెదేపా ఎన్ టీఆర్ ఎక్కడ ? అంటూ ప్రశ్నించారు. దానికి తెదేపా నుంచి సమాధానం రాలేదు. కానీ, వంశీని సస్పెండ్ చేశారు.

ఇక గురువారం మీడియాతో మాట్లాడిన వంశీ తాను సీఎం జగన్ కి సపోర్ట్ చేస్తానని తెలిపారు. జగన్‌ వెంటే నడుస్తానని ప్రకటించారు. అవసరమైతే.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. దీంతో ఆయన వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. అందుకే జగన్ పెట్టిన కండీషన్ ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇక తెదేపాపై వంశీ చేసిన ఆరోపణలని ఆ పార్టీ సీరియస్ గా తీసుకొంది. దానికి రియాక్షన్ గా వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత సస్పెండ్ చేయడమేంటన్నది మాత్రం పచ్చపార్టీ వారికి మాత్రమే తెలియాలి.