నిత్య కల్యాణం.. దోమలాంటోడు !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని నిత్య కల్యాణం అంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి నిత్య కల్యాణం దోమలాంటోడు అంటూ షాకింగ్ కమెంట్స్ చేశాడు. ఎప్పటిలాగే.. వరుస ట్విట్ లతో పవన్, తెదేపా నేతలపై తీవ్ర విమర్శలు చేశారు విజయశాయి. 

“నిత్య కళ్యాణం’ గురించి సోషల్ మీడియాలో  ఏమనుకుంటున్నారంటే… సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడట. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట. ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై ‘దోమ’లకు కష్టకాలమే” అంటూ విజయసాయి ట్విట్ చేశారు.

“దళితులకు రాజకీయలెందుకని బండ బూతులు తిట్టిన చింతమనేనికి, బలహీనవర్గాల బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులెందుకని ప్రశ్నిస్తున్న చంద్రబాబు, పవన్లకు ఏం తేడా లేదు. వీళ్లకు పేదోళ్లన్నా, నిమ్న వర్గాల వారన్నా చాలా చిన్న చూపు. ఎలక్షన్లలో చిత్తుగా ఓడించినందుకు ఇంకా కసి పెంచుకున్నారు”. “ఇసుక కొరత తీర్చాలంటూ చేసిన దీక్షలో మెడకు ఇసుక పొట్లాల దండ వేసుకున్నాడు. ఎప్పుడైనా కరువు పైన దీక్ష చేయాల్సి వస్తే ఎముకల హారం చుట్టుకునేలా ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాలు కట్టినంత మంది కూడా దొంగ దీక్షకు హాజరు కాలేదు” అంటూ వరుస ట్విట్ చేశారు.