సరిలేరు టీజర్ లోడింగ్ !


సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి గుడ్ న్యూస్. సరిలేరు నీకెవ్వరు టీజర్ రెడీ అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్ చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు టీజర్ లోడిండ్’ అంటూ ట్విట్ చేశాడు. టీజర్ ని డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయబోతున్నారని సమాచారమ్. సినిమాపై అంచనాలు మరింతగా పెరిగేలా టీజర్ ని వదలబోతున్నట్టు తెలుస్తోంది. టీజర్ మాత్రమే కాదు.. సరిలేరు ప్రమోషన్స్ వీడియోస్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేశారట. 

 క్యారెక్టర్ల పరిచయం కోసం ఒక్కో క్యారెక్టర్ మీద ఒక్కో విడియో తయారుచేసినట్లు సమాచారమ్. ఈ లెక్కన సరిలేరు నుంచి చాలానే వీడియోలు రాబోటున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి బాహుబలి, సాహో సినిమాలని ఫాలో అవుతున్నారు. ఇక త్వరలోనే  ఈ సినిమాలోని సాంగ్స్ ని కూడా అతి త్వరలో ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రంగం సిద్ధం చేస్తోందట. ముందుగా ఒక రొమాంటిక్ డ్యూయెట్ ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రంలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ సంగీత, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకర-దిల్ రాజు-మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సరిలేరు ప్రేక్షకుల ముందుకు రానుంది.