పవన్ తో సురేంధర్ రెడ్డి సినిమా !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘పింక్’ తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక మార్చి నుంచి క్రిష్ సినిమాని మొదలెట్టనున్నాడు పవన్. దాదాపు ఒకే సమయంలో రెండు సినిమాలు చేసేందులు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత పవన్ తో సినిమా చేసేందుకు చాలామంది దర్శకులే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పవన్ తో సినిమా చేసేందుకు మైత్రీ మూవీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.
 
ఇప్పటికే హరీష్ శంకర్ తో పవన్ కి కథ వినిపించింది. హరీష్ కు పవన్ నుంచి గ్యారెంటీ లభించలేదు. దర్శకుడు సురేంధర్ రెడ్డి కూడా పవన్ ని కలిశాడు. ఆయన్ని పవన్ దగ్గరికి తీసుకెళ్లింది కూడా మైత్రీనే. తప్పక సినిమా చేద్దామని సురేందర్ రెడ్డికి చెప్పాడట పవన్. ఐతే, అదెప్పుడు ? అన్నది మాత్రం స్పష్టత లభించలేదు. పింక్, క్రిష్ సినిమాలు పూర్తయిన తర్వాత పవన్ సినిమా హరీష్ తో ఉంటుందా ? లేదా సురేందర్ రెడ్డికి ఛాన్స్ దక్కుతుందా అన్నది చూడాలి. ఈలోపు పవన్ జార్జ్ రెడ్డి దర్శకుడు జీవన్ రెడ్డి లాంటోడు పవన్ కు అద్భుతమైన కథని చెప్పి ఒప్పిస్తారా ? అన్నది ఇప్పుడే చెప్పాలేం.