వెంకీమామకు ముళ్లు గుచ్చుకుంటే.. ఇలా ఉంటుందా ?

విక్టరీ వెంకటేష్ ఆయన మేనల్లుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. బాబీ దర్శకుడు. ఇందులో వెంకీకి జంటగా పాయల్ రాజ్ పుత్, చైతూకి జంటగా రాశీఖన్నా నటిస్తున్నారు. థమన్ బర్త్ డే కానుకగా వెంకీమామ నుంచి ‘ఎన్నాళ్లకో.. ఎన్నేళ్లకో.. ‘ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. వెంకీ-పాయల్ పై ఈ పాటని చిత్రీకరించారు.

ఇందులో వెంకీ వెంటేజ్ లుక్ లో ఆకట్టుకొన్నాడు. ఈ పాటకి శ్రీమణి లిరిక్స్ అందించారు. పృధ్వీ చంద్ర పాడారు. థమన్ సంగీతం అందించారు. సాంగ్ చాలా బాగుంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే రెట్రో సాంగ్ ఇది. ముఖ్యంగా వెంటేజ్ లుక్ లో వెంకీ, పాయల్ స్టెప్స్ హైలైట్ గా నిలిచాయ్. ఆ పాటని మీరు ఓ సారి చూసేయండీ.. !