ఖ్మాజీ మంత్రి గంటా ఆస్తుల వేలానికి రంగం సిద్ధం.. ఎందుకంటే ?
ఏపీ మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులు వేలాని రంగసిద్ధమైంది. ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణం తీసుకుని ఎగవేసిన కేసులో డిసెంబర్ 20వ తేదీన గంటా ఆస్తులకు వేలం నిర్వహించాలని బ్యాంకు నిర్ణయించింది. అప్పు మొత్తం విలువ రూ.209 కోట్లు. ఈ మొత్తం అప్పుకోసం తాకట్టు పెట్టిన ఆస్తుల విలువ రూ.35 కోట్ల 35 లక్షల 61 వేలు మాత్రమే. ఈ నేపథ్యంలో మిగతా బకాయిల కోసం వ్యక్తి గత ఆస్తులు స్వాధీనం చేసుకునే హక్కు ఉందని బ్యాంకు భావిస్తోంది. త్వరలోనే గంటా ఆస్తులని వేలం వేయడానికి సదరు బ్యాంక్ రెడీ అవుతోంది.
గతంలో గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ భూములు తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నట్లుగా గతంలో ఆరోపణలు వచ్చాయి. విశాఖ భూ కుంభకోణంలోనూ ఆయన పేరు గట్టిగా వినిపించింది. ఇక ప్రస్తుతం తెదేపా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గంటా.. త్వరలోనే పార్టీ మారబోతున్నారు. ఆయన బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. అది నిజమే అన్నట్టు గంటా.. బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అవుతూ కనిపిస్తున్నారు. ఈ యేడాది కాకపోయినా.. 2020లోనైనా గంటా కమలం గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.