గుడ్ న్యూస్ : టిక్ టాక్ నుంచి కొత్త యాప్

టిక్‌టాక్ ప్రియులకి గుడ్ న్యూస్. టిక్ టాక్ సంస్థ నుంచి సరికొత్త యాప్ రాబోతుంది. మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ను లాంచ్ చేయనుంది. వచ్చే నెలలో ఈ యాప్ విడుదల అవుతున్నట్లు తెలిసింది. టిక్‌టాక్ మాతృ కంపెనీ బైట్‌డ్యాన్స్ టెక్నాలజీ ఈ సరికొత్త యాప్ ని తీసుకురానుంది. అసలు టిక్ టాక్ నే బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆ కంపెనీ నుంచి కొత్త యాప్ రాబోతుండం విశేషం. 

ఆ యాప్‌ను నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కింద అందివ్వనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నెలకు 10 డాలర్ల కన్నా తక్కువగానే ఆ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ ఉంటుందని తెలిసింది. ఈ యాప్ కోసం మ్యూజిక్, సోనీ మ్యూజిక్, వార్నర్ మ్యూజిక్ తదితర ప్రముఖ మ్యూజిక్ కంపెనీలతో భాగస్వామ్యమైనట్లు సమాచారమ్. వచ్చే నెలలోనే టిక్‌టాక్ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ విడుదల కానుంది.