‘జార్జ్ రెడ్డి’ డైలాగ్ ప్రోమో.. చూశారా ?

‘జార్జ్ రెడ్డి’ సినిమా తెరకెక్కెటప్పుడు పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడతై బయటికొచ్చిందో అప్పుడు నుంచి ఈ సినిమా అందరి నోళ్లలో నానుతోంది. ఈ సినిమా టీజర్ పై సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, పీడీఎస్ యూ స్థాపకుడు జార్జ్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది.

ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. సందీప్ మాధవన్ జార్జ్ రెడ్డిగా కనిపించబోతున్నారు. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద సినిమా పరిణామం చెందింది. దాని వెనక పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా హీరోలు, ఇండస్ట్రీ సపోర్ట్ ఉందని అర్థమతోంది. ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి తాజాగా పవర్ ఫుల్ డైలాగ్ ప్రోమో ఒకటి విడుదల చేశారు. ఈ డైలాగ్ ప్రోమోని మీరు ఓ సారి చూసేయండీ.. !