తండ్రికాబోతున్న మాధవన్.. !?

సీనియర్ నటుడు మాధవన్ తండ్రి కాబోతున్నాడు అనే న్యూస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ వరుణ్ తేజ్ కి తల్లి పాత్రలో కనిపించబోతుందనే ప్రచారం జరిగింది. అదే సమయంలో వరుణ్ తండ్రి పాత్రలో మాధవన్ కనిపిస్తారనే ప్రచారం జరిగింది. ఈ న్యూస్ మాధవన్ అభిమానులకి షాక్ ఇచ్చింది. దీంతో ఓ అభిమాని.. ‘ఏంటీ.. ? నిజంగా మాధ‌వ‌న్ తండ్రి పాత్ర పోషిస్తున్నారా.. ఇది ఫేక్ అని నేను న‌మ్ముతాను’ అని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌కి మాధ‌వ‌న్ స్పందించారు. “టోట‌ల్లీ ఫేక్ బ్రో.. నేను ఇంకా చిన్న పిల్లాడినే” అని చెప్పి పుకార్ల‌కి పులిస్టాప్ పెట్టారు. ఇక వరుణ్ తేజ్-కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రినైసాన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో నిజంగానే రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటిస్తున్నారా ? లేదంటే ఇది కూడా ఫేక్ న్యూసేనా ? అన్నది తెలియాల్సి ఉంది.