బాలీవుడ్ ‘జెర్సీ’కి హీరోయిన్ ఫిక్స్ !

టాలీవుడ్ లో ‘జెర్సీ’ సూపర్ హిట్ అయింది. గౌతమ్ తిన్నమూరి దర్శకత్వంలో నాని-శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన ‘జెర్సీ’ తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకొంది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్ రిమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీ రిమేక్ లో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. మాతృక దర్శకుడు గౌతమ్ తిన్నమూరి దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమా కోసం హీరోయిన్ గా మృనాల్ ఠాకూర్ ని తీసుకొన్నారు. సూపర్ 30, బట్లా  హౌస్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకొంది. ఈ సినిమా గురించి మృణాల్ మాట్లాడుతూ.. “జెర్సీ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా. వర్జనల్ జెర్సీ సినిమాని చూశా. చాలా బాగుంది. అది ఎమోషనల్ జెర్నీ. చాలా బాగా నచ్చింది. వరుసగా రెండు సార్లు చూశా. బాలీవుడ్ జెర్సీ కోసం న్యాయం చేయాలని భావిస్తున్నా’నని చెప్పింది. 

బాలీవుడ్ లోనూ ‘జెర్సీ’ టైటిల్ తోనే తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం కొన్నాళ్లుగా క్రికెట్ లో శిక్షణ తీసుకుంటున్నాడు షాహిద్ కపూర్. ఆయన గత చిత్రం కబీర్ సింగ్ కూడా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ అర్జున్ కపూర్ కి రిమేక్ అన్న సంగతి తెలిసిందే. జెర్సీ కూడా హిట్టయితే.. బ్యాక్ టు బ్యాక్ తెలుగు రిమేక్స్ తో షాహిద్ కపూర్ హిట్ అందుకున్నట్టు అవుతుంది.