నిఖిల్ పెళ్లి ప్రకటన
యంగ్ హీరో నిఖిల్ పెళ్లి చేసుకొనేందుకు రెడీ అవుతున్నాడు. అతి త్వరలోనే పెళ్లి ప్రకటన చేస్తానని చెప్పాడు. ఆయన తాజా చిత్రం ‘అర్జున్ సురవరం’. తమిళ్ హిత్ ‘కణితన్’కి రిమేక్ ఇది. టీ.ఎన్ సంతోష్ దర్శకుడు. నిఖిల్ కి జంటగా లావణ్య త్రిపాఠి నటించింది. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అతి త్వరలోనే సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులతో ముచ్చటించిన నిఖిల్ పలు ఆసక్తికర విషయాలని పంచుకొన్నారు.
త్వరలోనే తన పెళ్లి తన ప్రకటన ఉంటుందని తెలిపాడు. ఇంకా చెప్పాలంటే అర్జున్ సురవరం రిలీజ్ అయిన వెంటనే ఉంటుందని చెప్పాడు. ఐతే, ప్రేమ వివాహమా ? పెద్దలు కుదిర్చిన పెళ్లా.. ? అమ్మాయి ఎవరు ?? అనే విషయాలు మాత్రం నిఖిల్ చెప్పలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ల ట్రెండ్ కనిపిస్తుంది. తాను కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు రెడీ. గతంలో రానాతో కలిసి నటించే అవకాశం వచ్చింది. కానీ, ఆ సినిమా పట్టాలెక్కలేదని చెప్పుకొచ్చాడు.
గతంలో ఓ హీరోయిన్ తో నిఖిల్ కి లింకు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరిద్దరు కలిసి వరుసగా ఒకట్రెండు సినిమాల్లో నటించేసరికి గాసిప్ లు పుట్టుకొచ్చాయ్. వీరి జంట కలర్ ఫుల్ గా ఉంటుందని అభిమానులు చెప్పుకొన్నారు. ఐతే, ఆ తర్వాత వీరిద్దరు మంచి స్నేహితులు మాత్రమేనని తేలిపోయింది. ఆ హీరోయిన్ పెళ్లి చేసుకొని ప్రస్తుతం హాయిగా కాపురం చేసుకుంటోంది. ఇప్పుడు నిఖిల్ కూడా పెళ్లి చేసుకొని లైఫ్ సెట్ అవ్వాలనే ప్లాన్ లో ఉన్నాడు.