వైరల్ : ‘గద్దలకొండ గణేష్’ పాటకి ఎన్టీఆర్ డ్యాన్స్

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వాల్మీకిగా తెరకెక్కిన ఈ చిత్రం కొన్ని కారణాల వలన గద్దలకొండ గణేష్ గా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ బాగా హిట్ అయింది. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సాంగ్ లో సీనియర్ ఎన్ టీఆర్ స్టెప్పులేయడం వైరల్ అవుతోంది. 

అదేంటీ.. ? అనుకొంటున్నారు. ఇది ఫ్యాన్ మేడ్ వీడియో. ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాల నుంచి బిట్ సీన్ ని తీసుకొని రూపొందించారు. ట్యూగ్ కి తగ్గట్టుగా సెప్ట్స్ ని కుదిరాయ్. ఈ వీడియో లింకుని ఓ నెటిజన్ దర్శకుడు హరీష్ శంకర్ కి ట్యాగ్ చేయగా.. ఆయన రిప్లై ఇచ్చారు. నవ్వుతున్న ఏమోజీలని జతచేశాడు. నిజంగానే ఈ వీడియో చూస్తే నవ్వుని ఆపుకోలేము. మీరు ఓసారి చూసేయండీ.. గద్దలకొండ గణేష్ పాటలో ఎన్ టీఆర్ చిందులు.. !