‘హైదరాబాద్ దాదా’లపై వర్మ సినిమా !

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  ఈసారి హైదరాబాద్ దాదాలపై మోజు పడ్డాడు. గత కొన్నాళ్లుగా ఆయన ఏపీ రాజకీయాలు, రౌడీయిజంపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని తీశాడు. ఈ సినిమా తర్వాత వర్మ చేస్తున్న చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. రెండు సినిమాలు తెదేపాను టార్గెట్ చేసినవే. తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ని ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నాడు వర్మ. ఈ సారి వర్మ ఫోకస్ హైదరాబాద్ దాదాలపై పడింది. 

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ దాదాలపై ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్టు వర్మ ప్రకటించారు. దాదాస్ ఆఫ్ హైద‌రాబాద్‌లో న‌టించేందుకు ‘జార్జిరెడ్డి’ హీరో సందీప్ మాధ‌వ్ సైన్ చేశాడు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితకథ ఆధారంగా జార్జ్ రెడ్డి సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి జీవన్ రెడ్డి దర్శకుడు. ట్రైలర్ తో ప్రశంసలు అందుకొన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకొనే క్రమంలోనే జార్జ్ రెడ్డి హీరో సందీప్ మాధవ్ హీరోగా దాదాస్ ఆఫ్ హైదరాబాద్ సినిమా ప్రకటన చేసేశాడు వర్మ. మరీ.. హైదరాబాద్ దాదాల లిస్ట్ పెద్దదే అని చెబుతుంటారు. మరీ.. వర్మ ఎంతమంది దాదాలని తెరపై చూపిస్తాడన్నది చూడాలి.