హైకోర్టులో తేలని ఆర్టీసీ సమ్మె వ్యవహారం
హైకోర్టులో ఆర్టీసీ సమ్మె వ్యవహారం తేలదని తేలిపోయింది. కొద్దిరోజులుగా ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమో.. కాదో తేల్చే అధికారం తమకు లేదని కోర్టు స్పష్టంచేసింది. అదే సమయంలో కార్మికులతో ప్రభుత్వం కచ్చితంగా చర్చలు జరపమని ఆదేశించలేమని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ వ్యవహారం హైకోర్టులో తేలదని తేలిపోయింది.
ఇక ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్దమా ? కాదా ? తేల్చాలని లేబర్ కోర్ట్ కి రిఫర్ చేసింది హైకోర్టు. ఇందుకు లేబర్ కోర్టుకి రెండ్జు వారాల సమయాన్ని ఇచ్చింది. ఇక రూటు పర్మిట్ల కేసుని హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రభుత్వం కోరినట్టుగా హైకోర్టు రూటు పర్మిట్లకి అనుమతిని ఇస్తే.. కనుక ఆర్టీసీ సమ్మె హీట్ అనేది చాలా వరకు తగ్గవచ్చు. ఇక సమ్మె విషయంలో లేబర్ కోర్టు ఏమీ తేలుస్తుంది.. ? దేని ఆధారంగా సమ్మె చట్టవిరుద్ధమా ? కాదా ? అని తేలుస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.