బ్రేకింగ్ : నాని ఆఫీసులో ఐటీ దాడులు

ఈ ఉదయం నుంచి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఇళ్లు, స్టూడియో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. నేచురల్ స్టార్ నాని కార్యాలయంలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఐటి లెక్కల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తిచడంతో ఈ అకస్మాత్తుగా చేసినట్టు సమాచారమ్. నాని విషయంలోనూ అదే జరిగింది. అందుకే తాజా సోదాలని తెలుస్తోంది.

ఇండస్ట్రీలో ఎలాంటి నేపథ్యం లేకుండా హీరోగా నిలదొక్కుకొని స్టార్ హీరోగా ఎదిగాడు నాని. స్టార్ హీరోలు యేడాది ఒక హిట్ కొట్టడానికికే క్రిందా మీదా పడుతుంటే.. యేడాది రెండు మూడు హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. డబుల్ హిట్స్ హ్యాట్రిక్ కూడా కొట్టేశాడు. ఈ యేడాది నాని నుంచి వచ్చిన జెర్సీ సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా రిమేక్ అవుతుంది. ప్రస్తుతం నాని ‘వి’ సినిమాతో బిజీగా ఉన్నారు.