#RRR : ఎన్టీఆర్ హీరోయిన్ ఈమెనే !

‘ఆర్ఆర్ఆర్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరంభీమ్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఆయన జంటగా నటించే హాలీవుడ్ హీరోయిన్ ఎవరనేది తెలిసిపోయింది. ఓలివియాని మోరీస్ తారక్ కి జంటగా కనిపించనుంది. సినిమాలో పాత్ర పేరు జెన్నీఫర్. ఈమె పాపులర్ హీరోయిన్ ఏమీ కాదు. హాలీవుడ్ థియేటర్ ఆర్టిస్ట్. కొద్దిసేపటి క్రితమే ఆర్ఆర్ఆర్ చిత్రబృందం తారక్ హీరోయిన్ పై అధికారిక ప్రకటన చేసింది. దీంతో.. ఆర్ ఆర్ ఆర్ లో  ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ వీడినట్టయింది.

ఇక ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఇప్పటికే 70శాతం పూర్తయింది. మిగిలిన 30శాతం షూటింగ్ లో ఎన్టీఆర్-ఓలివియాపై చిత్రీకరించే సీన్స్ కొన్ని ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు.  ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే యేడాది జులై 30న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రమిది. బాహుబలిని మించేలా జక్కన్న ఆర్ ఆర్ ఆర్ ని తీర్చిదిద్దుతున్నాడని చెబుతున్నారు.