సీఎం పదవికి జగన్ రాజీనామా ?

ఏపీ సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు బహిరంగానే ప్రకటన చేశారు. కాకపోతే.. ఇది స్వయంగా సీఎం జగన్ చేసిన రాజీనామా కాదు. ఆయన చేత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేయించారు. ఎందుకు ? దానికి దారితీసిన పరిస్థితులు ఏంటన్నది తెలియాలంటే ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా చూడాల్సిందే. తాజాగా ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ ని విడుదల చేశారు. ఇందులో మరోసారి తెదేపా అధినేత చంద్రబాబు, చిన్నబాబు లోకేష్ లని మరోసారి ఏడిపించాడు వర్మ.

అంతేకాదు.. రెండో ట్రైలర్ లో ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. మరో ఐదేళ్లు పార్టీని నడపడం.. ఆలోపు బుడ్డోడు (జూ.ఎన్టీఆర్) లాక్కోకపోతే.. అనే డైలాగ్ పెట్టాడు. ఇక కొడుకు కోసం చంద్రబాబు పార్టీని సర్వనాశనం చేశాడని ఓ తెదేపా నేత అసహనం వ్యక్తం చేయడం ట్రైలర్ లో చూడొచ్చు. ఇటీవల ఏపీలో జరిగిన హత్యా రాజకీయాలు తెదేపా చేసినవే అన్నట్టుగా చూపించారు.

ఇక ఎప్పటిలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఊపుమీద ఒకట్రెండు మాటలు మాట్లాడారు. ఆఖర్ లో వర్మ సప్రైజ్ చేశారు. ‘నేను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా’ అంటూ ప్రకటించారు. ఇదే సినిమాలో అసలైన ట్విస్ట్ అనుకొంటా. ఇప్పటి వరకు ఏపీ రాజకీయాల్లో జరగని సీన్ అది. బహుశా.. సినిమాలో సీఎం జగన్ రాజీనామా చేసి.. మళ్లీ ఆఖండ మెజారిటీ తెలుస్తాడేమో.. !