సోషల్ మీడియాపై కేంద్రం క్లారిటీ
సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ ను అనుసంధానం చేయడంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అసలు ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో తెలిపారు. ఆధార్ డేటా సంపూర్ణంగా సురక్షితంగా ఉంది. ఆ డేటాను ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ 69ఏ ప్రకారం ప్రజా ప్రయోనాల దృష్ట్యా అకౌంట్లను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.
గత మూడేళ్లలో ప్రభుత్వం బ్లాక్ చేసిన యూఆర్ఎల్స్ సంఖ్యను రిలీజ్ చేశారు. ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసెస్ స్పైవేర్ గురించి ఎంపీ అసద్ అడిగిన ప్రశ్నకు కూడా రవిశంకర్ సమాధానం ఇచ్చారు. స్పైవేర్ దాడి గురించి ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నదన్నారు. మన దేశానికి చెందిన 121 ఫోన్లను ట్యాప్ చేసి ఉంటారని మంత్రి తెలిపారు. పౌరుల ప్రైవసీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.