‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయిందోచ్ !

‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ అప్పుడే 70శాతం పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ డివివి బ్యానర్ ప్రకటించేసింది. అంతేకాదు.. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కు జంటగా నటించే హీరోయిన్ పేరుని ఈరోజు ప్రకటిస్తామని తెలిపింది. ఆ అధికారిక ప్రకటన రాకముందే ఆర్ ఆర్ ఆర్ లో తారక్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయిందని అంటున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం  ప్రకారం ఓ విదేశీ థియేటర్ ఆర్టిస్ట్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె నెట్ లో అంత పాపులర్ కాదని కూడా తెలిసింది.

గతంలో ప్రచారం జరిగినట్టుగా ఎన్ టీఆర్ కోసం హాలీవుడ్ థియేటర్ ఆర్టిస్ట్ ఓలివియాని తీసుకున్నట్టు తెలుస్తొంది. ఈ పేరునే ఈ సాయంత్రం ప్రకటిస్తారు. హీరోయిన్ తో పాటుగా విలన్ పేరు కూడా ప్రకటిస్తారు. అజయ్ దేవగన్ సినిమాలో వున్నాడు. కానీ ఆయనది వినల్ పాత్ర కాదు. అతని పాత్ర ఎన్టీఆర్-చరణ్ లకు గురువు లాంటది అని ఓ టాక్ వుంది. విలన్ గా కూడా విదేశీ నటుడినే తీసుకుంటున్నారని అంటున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేటు మారనుందట. కానీ, ఆ కొత్త డేటుని ఇప్పుడే ప్రకటించరని తెలుస్తోంది. రిలీజ్ డేటు దగ్గరపడిన సమయంలో కొత్త రిలీజ్ డేటుని ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారమ్.