మజిలీ దర్శకుడుకి డబుల్ దమాఖా

‘నిన్నుకోరి’ సినిమాతో ప్రతిభ గల దర్శకుడు అనిపించుకొన్నాడు శివ నిర్మాణ. ఎమోషన్స్ ని బలంగా పండించడం శివ ప్రత్యేకత. మజిలీ సినిమాతో అది మరోసారి రుజువైంది. ఈ యేడాది ప్రథమార్థంలో వచ్చిన మజిలీ బ్లాక్ బస్టర్ హిట్టయింది. నాగచైతన్య-సమంత కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నానితో శివ మరో సినిమా చేయాలనుకొన్నాడు. 

అదే సమయంలో విజయ్ దేవరకొండతో సినిమా చేసే ఛాన్స్ దక్కింది. మరీ.. ఇద్దరిలో శివ నిర్వాణ ఎవరితో సినిమా చేస్తారనే సస్పెన్స్ ఇన్నాళ్లు ఉండేది. ఇప్పుడా సస్పెన్స్ తొలిగిపోయింది. నాని, విజయ్ దేవరకొండ ఇద్దరితో శివ సినిమాలు చేయబోతున్నాడు ముందుగా మాత్రం నానితోనే. ముందుగా నాని హీరోగా, సాహు నిర్మాతగా ఓ సినిమా చేసేస్తారు. ఆ తరువాత విజయ్ దేవరకొండ రెడీ అవుతారు.

విజయ్-పూరి కాంబినేషన్ లో ప్లాన్ చేస్తున్న సినిమా కాగానే శివనిర్వాణ సినిమా వుంటుందని తెలుస్తోంది. ఈ సినిమా మైత్రీ మూవీస్ లో తెరకెక్కాల్సింది. కానీ, ఇప్పుడీ సినిమాని దిల్ రాజు టేకప్ చేయబోతున్నారని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి తర్వాత నుంచి విజయ్ తో ఓ సినిమా చేయాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు. అది శివ నిర్వాణ సినిమాతో తీరనుంది.