బన్నీ ముద్దుల కూతురికి బర్త్ డే విషెస్
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ 3వ పుట్టినరోజు నేడు. కూతురుకి బన్నీ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘నా చిన్నారి దేవత అల్లు అర్హకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా అర్హ చక్కటి ఫోటోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. అందులో అర్హ చిరునవ్వులు ఒలికిస్తూ రంగురంగుల బెలూన్లు, ఇతర టాయ్స్ నడుమ సెలబ్రేషన్ మూడ్ లో కనిపిస్తోంది. గత యేడాది అర్హ పుట్టినరోజు వేడుకలని గోవాలో జరిపారు. ఈసారి బన్నీఅల.. షూటింగ్’లో బిజీగా ఉన్నారు.
ఈరోజు రాత్రికి మెగా ఫ్యామిలీ అంతా బన్నీ ఇంటికి చేరుకొని సందడి చేయనుంది. ఈ వేడుకకి బన్నీ సన్నిహితులు, స్నేహితులు కొందరు హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల చిల్డ్రన్స్ డే సందర్భంగా అల్లు అర్జున్ తన పిల్లలకి సప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అల.. వైకుంఠపురంలోని ఓ మైడాడీ సాంగ్ ప్రోమోని బన్నీ ఇద్దరు పిల్లలపై కట్ చేశారు. అందులో బన్నీ పిల్లు క్యూట్ గా కనిపించారు. వారిని చూసి.. బన్నీ ఫ్యాన్స్ మురిసిపోయారు. ఇక త్రివిక్రమ్-అల్లు అర్జున్ హ్యాట్రిక్ సినిమా ‘అల.. వైకుంఠపురంలో’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా అల.. జనవరి 12న రిలీజ్ కానుంది.