గ్రేట్ : అవినీతి నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం
ఏపీ సీఎం జగన్ తనదైన మార్క్ పాలనతో ఆకట్టుకొన్నాడు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తగ్గలేదు. దానికి సంబంధించిన జీవోని ఏపీ ప్రభుత్వం బుధవారమే విడుదల చేసింది. వచ్చే యేడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను అమలు చేయనున్నారు. తాజాగా మరో ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకొంది.
అవినీతి నిర్మూలన కోసం అహ్మదాబాద్ ఐఐఎంతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గురువారం సీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐఐఎం(ఎ) ప్రొఫెసర్ నారాయణస్వామి, ఏసీబీ చీఫ్ విశ్వజిత్ ఒప్పంద పత్రాలపై సీఎం జగన్ సమక్షంలో సంతకాలు చేశారు. ఐఐఎం బృందం వచ్చే ఏడాది ఫిభ్రవరి మూడో వారం వరకు ఈ అంశంపై అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేయనుందని తెలుస్తోంది.