రజనీకి వరంగా మారిన మహేష్ బ్యాడ్ సెంటిమెంట్ !

సినిమా వాళ్లకి సెంటిమెంట్స్ ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైన డేటుకి మరో సినిమాని రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే అట్టర్ ప్లాపైన సినిమా రిలీజైన డేటుకి మరో సినిమాని రిలీజ్ చేయడానికి అస్సలు ఇష్టపడారు. జనవరి 10 విడుదలైన మహేష్ సినిమాలు ‘1-నేనొక్కడినే’ అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇక త్రివిక్రమ్-పవన్ సినిమా అజ్ఝాతవాసి కూడా జనవరి10న విడుదలై అట్టర్ ప్లాపుగా నిలిచింది. త్రివిక్రమ్ కెరీర్ లోనే ఓ మచ్చలా  మిగిలిపోయింది.

ఈ నేపథ్యంలో వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఒకేరోజున జనవరి 12న రాబోటున్న సినిమాలు అల.. వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు జనవరి 10కి జరగడానికి జక్కుతున్నాయి. జనవరి 11న సరిలేరు, 12న అల.. ఫిక్సయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకి వరంగా మారింది. మురగదాస్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘దర్భార్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కాబోతుంది. దీంతో 9, 10 ఈ రెండ్రోజులు రజనీదే హవా. 

ఇక జనవరి 15న కల్యాణ్ రామ్ ‘ఎంతమంచివాడవురా!’ రిలీజ్ కాబోతుంది. మొత్తంగా సంక్రాంతి సీజన్ లో నాలుగు సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఇందులో మూడు సినిమాలు తెలుగు సినిమాలు. ఒకటి డబ్బింగ్ సినిమా అనడానికి వీల్లేదు. ఎందుకంటే ? తెలుగులో రజనీ సినిమాలు చాలానే బ్లాక్ బస్టర్ హిట్టయిన సందర్భాలున్నాయి. కథ ప్రేక్షకులకి కనెక్ట్ అయితే.. తెలుగులో స్టార్ హీరోలని మించిపోయే కలెక్షన్స్ కురిపించే సత్తా రజనీకాంత్ ది. సంక్రాంతి సీజన్ లో సేఫ్ రిలీజ్ ఆయన దర్బార్ నే అనిపిస్తోంది.