ఎన్టీఆర్ హీరోయిన్ ఎంత హాట్.. చూశారా ?


‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరన్నది తెలిసిపోయింది. బాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ ఎన్టీఆర్ తో జతకట్టనుంది. ముందుగా ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ ని తీసుకొన్న సంగతి తెలిసిందే. ఐతే, ఆమె కొన్ని కారణాల వలన సినిమా నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి ఎన్టీఆర్ కోసం మరో హాలీవుడ్ హీరోయిన్ ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు జక్కన్న.

ఫైనల్ గా హాలీవుడ్ థియేటర్ ఆర్టిస్ట్ ఒలివియా మోరీస్ ని ఎంపిక చేశారు. ఈమె పాపులర్ హీరోయిన్ కాదు. కానీ, మంచి నటి అనిపించుకుంది. ఎన్ టీఆర్ హీరోయిన్ ఒలివియా మోరీస్ అంటూ ఆర్ఆర్ఆర్ చిత్రబృందం చాలా పద్దతిగా ఉన్న ఆమె ఫోటో ఒకటి విడుదల చేశారు. కానీ, ఒలివియా చాలా హాట్ హీరోయిన్. సోషల్ మీడియాలో ఆమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు మీకోసం సేకరించాం. వాటిని మీరు ఓసారి చూసేయండీ.. !

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఈ చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, తారక్‌ కొమరం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. దాదాపు రూ.400కోట్లపైగా బడ్జెట్’తో డీవీవీ దానయ్య సినిమాకు నిర్మిస్తున్నారు. 2020 జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.