రూలర్ టీజర్ వచ్చేసింది !

నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘రూలర్’. కెయస్. రవికూమర్ దర్శకుడు. బాలయ్యకి జంటగా సోనాల్ చౌహాన్, వేదిక నటించారు. సి. కల్యాణ్ నిర్మించారు. డిసెంబర్ 20న రూలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. టీజర్ లో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించారు బాలయ్య. ఫ్లాష్ బ్యాక్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, ఆ తరాత స్టయిలీష్ లుక్ లో కనిపించారు. ఆ రెండు పాత్రల మధ్య లింక్ ఏంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

‘ధర్మ  మా గ్రామ దైవం. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనే ముందుంటాడు’ అనే వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలైంది. ఆ తర్వాత యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేశాడు బాలయ్య. ఒంటిమీద ఖాకీ యూనిఫామ్ ఉంటేనే.. బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా… బయటికొచ్చిన సింహంలా ఆగను… ఇక వేటే అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ బాగా పేలింది. సోనాల్ చౌహాన్ అందాల ఆరబోత కూడా టీజర్ లో హైలైట్ గా నిలిచింది.