నాని, సురేష్ బాబు ఇళ్లలో ఐటీ రైడ్స్.. శ్రీడ్డి ఫుల్ హ్యాపీ !

హైదరాబాద్ లో బుధవారం పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి. నిర్మాత సురేష్ బాబు, నేచురల్ స్టార్ నాని లకి చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. నాని ఐటీ దాడులు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. గత నాలుగేళ్లకు సంబంధించిన వీరు దాఖలు చేసిన ఐటీ రిటర్స్ సరిగ్గాలేని కారణంగా ఐటీ రైడ్స్ జరిగినట్టు సమాచారమ్. ఈ దాడులు ఏమైనా అవినీతి సొమ్ము బయటపడిందా ? అన్నది మాత్రం బయటికిరాలేదు.

ఈ విషయం పక్కనపెడితే.. నాని, సురేష్ బాబు ఇళ్లలో ఐటీ దాడులు జరగడాన్ని వివాదాస్పద నటి శ్రీరెడ్డి తెగ ఎంజాయ్ చేస్తోంది. నాని,
సురేష్ బాబు ఫ్యామిలీ ఇద్దరు శ్రీరెడ్డి బాధ్యులే. సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తన వాడుకొన్నాడని శ్రీరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అభిరామ్ తో ముద్దుసీన్లకి సంబంధించిన ఫోటోలని బయటపెట్టింది. ఇక నానిపై కూడా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బయటికి కనిపించినంత మంచోడేమి కాదని ఆరోపించింది.

ఇక తాజా ఐటీ రైడ్స్ పై శ్రీరెడ్ది తనదైన శైలిలో స్పందించింది. ఐటి అధికారులకు శ్రీ రెడ్డి కృతజ్ఞతలు చెప్పింది. సురేష్ బాబు శ్రీ రెడ్డి మాజీ ప్రేమికుడైన అభిరామ్ దగ్గుబాటికి తండ్రి. సురేష్ బాబుపై ఐటి దాడులతో చాలా సంతోషంగా ఉన్నా. ‘సురేష్ బాబుపై ఐటి రైడ్ జరుగుతోంది. జై మోడీ జీ. నాని నీ నువ్వు కర్మ అనుభవించు అంటూ శ్రీరెడ్డి కామెంట్స్ పెట్టింది.