ట్విట్టర్ రివ్యూ : జార్జ్ రెడ్డి – ఆత్మ మిస్సయింది

ఉస్మానియా యూనివర్సిటీ లీడర్, పీడీఎస్ యూ వ్యవస్థాపకుడు జార్జ్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘జార్జ్ రెడ్డి’. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిన్న సినిమా తెరకెక్కిన ‘జార్జ్ రెడ్డి’ ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో పెద్ద సినిమాగా రూపాంతరం చెందింది. సంచలన విజయం సాధించేలా జార్జ్ రెడ్డి కనిపించాడు. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముంకొచ్చిన జార్జ్ రెడ్డి ఆ అంచనాలని అందుకొన్నాడా ? అంటే మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. జార్జ్ రెడ్డి ఆత్మ మిస్సయిందని చెబుతున్నారు.

వాస్తవానికి విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితకథ ఈ తరానికి తెలియదు. జార్జ్ రెడ్డి కథలోనే హీరోయిజం ఉంది. దాన్ని తెరపై అద్భుతంగా చూపించవచ్చు. ఈ విషయంలో దర్శకుడు తడబడినట్టు చెబుతున్నారు. జార్జ్ రెడ్డి జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఫిక్షన్ స్టోరీగా తెరకెక్కించారని, 60శాతం కల్పితాలతోనే సినిమా తీశారని అంటున్నారు. దాంతో జార్జ్ రెడ్డి ఆత్మ మిస్సయిందని సినిమా చూసినవాళ్లు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

జార్జ్ రెడ్డి కథని దర్శకుడు జీవన్ రెడ్డి ఆసక్తిగా మొదలెట్టారు. ఓ ఫారన్ అమ్మాయి జార్జ్ రెడ్డి గురించి తెలుసుకొనేందుకు ఇండియాకు వస్తుంది. అక్కడి నుంచి జార్జ్ రెడ్డి ఎంట్రీ. మొదట్లో సాధారణ విద్యార్థిగానే ఉండే జార్జ్ రెడ్డి ఎందుకు సీనియర్ విద్యార్థులకి ఎదురు తిరగాల్సి వచ్చింది. ఎందుకు విద్యార్థి పోరాటాలు చేయాల్సి వచ్చిందనే విషయాలని సాదాసీదాగా చూపించాడు. తొలిభాగం మొత్తం.. జార్జ్ రెడ్డి సీరియస్ విద్యార్థి నాయకుడిగా ఎందుకు మారాడు అన్నది చూపించాడు. 

ఇక సెకాంఢాఫ్ లో క్యాంపస్ ఎన్నికలు, జార్జ్ రెడ్డిపై దాడికి ప్రత్యర్థుల ప్లాన్ లని ఆసక్తికర చూపించాడు. క్లైమాక్స్ లో పక్కా పథకంతో జార్జ్ రెడ్డిని హత్య చేయడం, దానికి పోలీసుల సపోర్టు చేయడం వంటి సన్నివేశాలతో ఎమోషనల్ గా తెరకెక్కించాడు. కథ-కథనాలు పడిలేచినట్టుగా సాగాయి. ఐతే, ప్రధాన పాత్రల్లో నటించిన వాళ్లు అద్భుతంగా నటించారు. ప్రధానంగా జార్జ్ రెడ్డిగా కనిపించిన సందీప్ మాధవ్ నటన చాలా బాగుంది. మొత్తంగా.. కథలో జార్జ్ రెడ్డి ఆత్మ మిస్సయింది. ఇది పక్కా జార్జ్ రెడ్డి బయోపిక్ అంటే ఒప్పుకోము అనేవారు కూడా కొందరు ఉన్నారు.