ఆమెతో నాగశౌర్య డేటింగ్.. నిజమే !


యంగ్ హీరో నాగశౌర్య మెగా హీరోయిన్ నిహారికతో ప్రేమలో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి ‘ఒకమనసు’ చిత్రంలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్టు ప్రచారం జరిగింది. ఐతే,  నాగశౌర్య డేటింగ్ ఉన్న మాట నిజమేనట. కానీ, అది నిహారికతో కాదు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపార వేత్త కూతురునాగశౌర్య ప్రేమలో ఉన్నట్టు సమాచారమ్.

ఈ డేటింగ్ వ్యవహారం పెళ్ళి పీటలు వరకు వెళ్ళుతుందా ? లేదా ?? అన్నది చూడాలి. ఈ డేటింగ్ విషయం నిజమే అయితే.. వచ్చే యేడాదియే నాగశౌర్య ఓ ఇంటివాడు కావొచ్చు. మరో యంగ్ హీరో నిఖిల్ కూడా పెళ్లికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రేమలో ఉన్న నిఖిల్ త్వరలో పెళ్లి న్యూస్ చెబుతానని ఇటీవలే చెప్పాడు. ఇక నాగశౌర్య విషయానికొస్తే ప్రస్తుతం ఆయన ‘అశ్వద్దామ’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఛలో సినిమాతో ఆ రేంజ్ హిట్ దక్కని నాగశౌర్య ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకొన్నాడు.