‘జార్జ్ రెడ్డి’ సినిమాలో ఈ ప్రశ్నకు సమాధానం ఏది ?
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జర్జ్ రెడ్డి జీవితకథ ఆధారంగా జార్జ్ రెడ్డి సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. వాస్తవానికి జార్జ్ రెడ్డిని చంపింది ఎవరు ? అనేది సమాధానం లేని ప్రశ్న.జార్జ్ హత్య కేసులో మొత్తంగా 9 మందిపైన ఛార్జ్ షీట్స్ దాఖలయ్యాయి.
అందులో ఆరుగురికి ఏబీవీపీతో సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. వారు ఆరు నెలల పాటు జైలు శిక్షను అనుభవించారు. వీళ్లను విడుదల చేసే రోజున NSUI ఆధ్వర్యంలో క్యాంపస్‌లో భారీ ప్రదర్శన కొనసాగింది. కోర్టుల వల్ల ఏదీ కాదు, మేమే వారికి శిక్షను విధిస్తామంటూ నినాదాలు చేసారు స్టూడెంట్స్. సినిమాలోనైనా జార్జ్ రెడ్డిని ఎవరు హత్య చేశారు ? అనేది చూపిస్తారని అందరు భావించారు. కానీ, సినిమాలోనూ దానిపై ఫోకస్ చేయలేదు.
జార్జిరెడ్డి బయోపిక్‌లోనూ జార్జ్‌ను ఎందుకు చంపారు, ఎవరు చంపారు అన్న విషయాలను డీప్‌గా చర్చించలేదు. దానికి బదులుగా, జార్జ్ ఎలాంటివాడు, జార్జ్ ఎలాంటి ఆలోచనశైలి ఎలా ఉండేది అనేది ఎక్కువగా ప్రస్తావించారు.. జార్జ్ చావు కంటే జార్జ్ జీవించిన విధానాన్ని సినిమాలో ఫోకస్ చేశారు. మొత్తానికి.. జార్జ్ రెడ్డిని చంపిదెవరు ? సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది.