కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 7లక్షల ఉద్యోగ ఖాళీలు
నిరుద్యోగులకి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది మార్చి 1 నాటికి మొత్తం ఆరు లక్షల 83వేల 823 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాచారంలో తెలిపారు. ఐతే, వాటి భర్తీకి సంబంధించిన విషయంపై మంత్రి స్పష్టమైన ప్రకటన చేయలేదు.
గ్రూప్ సీ లో మొత్తం 5,74,289, గ్రూప్ బీ లో 89,638 గ్రూప్ ఏ విభాగంలో 19,896 ఉద్యోగాలు భర్తీ కావల్సి వుందని వివరించారు. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబిసి) బ్యాక్ లాగ్ రిజర్వు పోస్టుల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. అంతేకాదు.. ఈ రెండేళ్లలో మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయన్నారు.