సరిలేరు సెట్స్’లో అనిల్ బర్త్ డే వేడుకలు

దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ ని ప్రత్యేకంగా విష్ చేశారు. ‘నీతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం. సక్సెస్ మాత్రమే కాదు చాలా చాలా బ్లాక్ బస్టర్స్ అందుకో’ అంటూ మహేష్ ట్విట్ చేశాడు. ఈ సందర్భంగా సరిలేరు సినిమాలోని ట్రైయిన్ ఏపీసోడ్ కి సంబంధించిన పిక్ ని మహేష్ షేర్ చేశాడు. అంతేకాదు.. సరిలేరు తర్వాత వెంటనే అనిల్ తో మరో సినిమా చేస్తానని మహేష్ మాటిచ్చాడట.

ఇక సరిలేరు సెట్స్ లోనే అనిల్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మహేష్ సమక్షంలో అనిల్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తీసుకొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శుక్రవారం విడుదలైన సరిలేరు టీజర్ అదిరిపోయింది. దేశభక్తితో పాటు.. అనిల్ మార్క్ వినోదం టీజర్ లో కనిపించింది. ఈ సినిమాలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు.