మెగాస్టార్ మెచ్చిన ‘అర్జున్ సురవరం’ !

యంగ్ హీరో నిఖిల్ సినిమాలు విభిన్నంగా ఉంటాయనే ముద్రపడిపోయింది. ఈ నేపథ్యంలోనే నిఖిల్ సినిమా కోసం వెయిట్ చేసే ప్రేక్షకగణం ఏర్పడింది. స్వామిరారా, కార్తీకేయ, ఎక్కడికిపోతావు చిన్నివాడా లాంటి వైవిధ్యమైన కథలతో నిఖిల్ విజయాలు అందుకొన్నారు. ఐతే, ఈ మధ్య ఆయన్ని వరుసగా ప్లాపులు పలకరిస్తున్నాయి. 

నిఖిల్ తాజా చిత్రం ‘అర్జున్ సురవరం’. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఆయనకి మెగాస్టార్ చిరంజీవితో మంచి సాన్నిహిత్యం ఉంది. దాంతో అర్జున్ సురవరం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రావాల్సిందిగా చిరుని కోరారట. అంతకంటే ముందు సినిమా చూడాలి. సినిమా నచ్చితేనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తానని చెప్పాడట చిరు. చిరు అర్జున్ సురవం సినిమా చూడటం జరిగింది. చిరుకి నచ్చింది కూడా. దీంతో  ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చేందుకు ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది.