16యేళ్ల అబ్బాయితో రాశీఖన్నా రొమాన్స్ !
హీరోయిన్ రాశీఖన్నా 16యేళ్ల అబ్బాయితో రొమాన్స్ చేసిందట. అప్పుడు ఆమె వయసు కూడా 16యేళ్లేనట. టీజేజ్ లవ్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాశీ చెప్పింది. తాను 16 ఏళ్లకే డేటింగ్ చేశా.. తాను డేటింగ్ చేసిన అబ్బాయి వయసు కూడా 16 ఏళ్లేనని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో మస్త మజాగా ఉండేదని తీపి జ్ఝాపకాలని గుర్తు చేసుకుంది.
‘మద్రాస్ కేఫ్’ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది రాశీఖన్నా. తెలుగులో `ఊహాలు గుసగుసలాడే` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేసింది. ‘తొలిప్రేమ’తో ఆమెలోని అసలుసిసలు నటిని బయటికి తీసింది. ప్రస్తుతం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ లోనూ మెరుస్తోంది. ప్రస్తుతం వెంకీమామ, ప్రతిరోజు పండగ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ రెండు సినిమాలు నెల గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.