ఈసారి చైతూ ఫిదా చేశాడు

శేఖర్ కమ్ముల సినిమాలు చూస్తే ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే. సినిమాలో ఎలాంటి గందరగోళం ఉండదు. కొట్టుకోవడం, తిట్టుకోవడాలు, కక్ష్య సాధింపులు, సస్పెన్స్, థ్రిల్లర్, ప్రేక్షకుడిని టెన్షన్ పెట్టే అంశాలు ఏవీ ఉండవు. సినిమా హాయిగా సాగిపోతుంటుంది. ప్రేక్షకుడు సినిమాలో లీనమై ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అందుకే శేఖర్ కమ్ముల సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆయన తాజా చిత్రం చైతూ-సాయిపల్లవి జంటగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చైతూ నటిస్తున్న 19వ సినిమా ఇది.

చైతూ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఇందులో చైతూని బాగానే కష్టపెట్టాడు. చీపూరు పట్టి ఇళ్లు ఊడ్ఛాడు. పైసా పైసా లెక్కపెట్టి.. లెక్క రాసిపెట్టుకొంటున్నాడు. అచ్చం మిడిల్ క్లాస్ అబ్బాయిలా కనిపించాడు. కష్టాల్లో ఉన్న చైతూ.. ఓ అమ్మాయిని చూడగానే మొహం వెలిగిపోయింది. స్వచ్చమైన నవ్వుతో కనిపించాడు. ఆ అమ్మాయి ఎవరు ? చైతూ ప్రేమకథ ఏంటీ తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 

ఈ చిత్రంలో చైతూ తెలంగాణ కుర్రాడిలా, సాయి పల్లవి ఆంధ్రా అమ్మాయిలా కనిపించబోటున్నట్టు సమాచార్. వీరిద్దరి మధ్య లవ్ స్టోరీని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. ఐతే ఈసారి చైతూ తన నటనతో ఫిదా చేసేలా కనిపిస్తున్నాడు. టీజర్ అదిరిపోయింది. చివరలో చైతూ మొహంలో స్వచ్చమైన నవ్వు ఆకట్టుకుంటోంది.