ఆర్టీసీ సమ్మె మళ్లీ మొదలు !
ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెని విరమించిన సంగతి తెలిసిందే. ఎలాంటి షరతులు లేకుండా తిరిగి విధుల్లోకి చేరేందుకు సిద్ధమైన ప్రకటించారు. ఐతే, ఆర్టీసీ యదాథతంగా నడపడం ఇప్పుడు వీలుకాదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికులని తిరిగి విధుల్లోకి చేర్చుకొనేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. రూటు పర్మిట్లపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం ప్రయతిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోఎంజీబీఎస్ లో ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. భవిషత్య కార్యాచరణపై చర్చించారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇకపై కూడా సమ్మెని కొనసాగించాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రేపు ఎంజీబీఎస్ లో మహిళా ఉద్యోగుల నిరసన కార్యక్రమం ఉంటుందని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. కార్మికులెవరూ భయపడొద్దని.. ఆర్టీసీ ప్రైవేటీకరణ సాధ్యం కాదన్నారు. ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందన్నారు. రేపు భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.