‘రాములో రాములో..’ బోనస్ చూశారా ?

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన మూడు పాటలు సూపర్ హిట్టే. తొలి సాంగ్ ‘సామజవరగమన’ సరికొత్త రికార్డులని సృష్టించింది. యూట్యూబ్ లో 1మిలియన్ లైక్స్ సొంతం చేసుకొంది.

రెండో సాంగ్ మాస్ సాంగ్ ‘రాములో రాములో.. ‘ రికార్డ్ స్థాయిలో వ్యూస్, లైకులు సొంతం చేసుకొంది. తాజాగా ఈ పాటకి సంబంధించిన ఓ చక్కటి వీడియోని సంగీత దర్శకుడు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో ఆయన గురువు శివమణితో  కలిసి సంగీత కచేరి చేశారు. రాములో రాములో సాంగ్ షూట్ చేసిన సందర్భంలోని వీడియోలా ఉంది. దీంతో ఇది రాములో రాములో సాంగ్ కి బోనస్ గా ప్రేక్షకులు చెప్పుకొంటున్నారు. ఆ వీడియోని మీరు ఓ సారి చూసేయండీ.. !