వెన్నుపోటు ఫలితం : అవినీతి కేసుల్లో అజిత్ పవార్’కు క్లీన్ చీట్
ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీకి సపోర్టు చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహారాష్ట్ర సీఎంగా బాధ్యలు చేపట్టారు. అజిత్ పవార్ కి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. అంతేకాదు.. 9 అవినీతి కేసుల్లో అజిత్ పవార్ కి క్లీన్ చీట్ లభించింది. ఆయన బీజేపీకి మద్దతు తెలిపిన రెండ్రోజుల్లోనే అవినీతి కేసులు మాఫీ కావడం విశేషం.
మొత్తం 9 అవినీతి కేసుల్లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ లభించింది. నీటిపారుదల ప్రాజెక్టులో 70 వేల కోట్ల అవినీతి జరిగిందన్న కేసును కూడా మూసేశారు. ఈ సందర్భంగా ఏసీబీకి చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, అజిత్ పవార్ పై ఎలాంటి అవినీతీ కేసులు లేవని తెలిపారు. మరోవైపు, అజిత్ పవార్ కు క్లీన్ చిట్ రావడంపై శివసేన, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. ఇదంతా క్విడ్ ప్రోకోలో భాగమేనని ఆరోపించాయి.