అప్పుడు నన్నెవ్వరూ.. పట్టించుకోలేదు !

సినిమా అయిన, క్రికెట్ అయినా వెలుగులోకి వచ్చాకే ఆఫర్లు ఉంటాయి. అప్పటి వరకు కష్టాలు ఎదుర్కోవాల్సిందే. బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ కూడా మొదట్లో బాగానే కష్టాలు పడిందట. ధోనీ’ చిత్రంతో వెండితెరకు కథానాయికగా పరిచయమయ్యానని అందరూ అనుకుంటారు. కానీ అంతకంటే ముందు నేను ‘ఫగ్లీ’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత తనకి రెండో సినిమా ఛాన్స్ రాదేమో అనుకుందట. ఇక ఈ యేడాది కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కైరాకు డిమాండ్ పెరిగింది. అందరూ కైరానే కావాలంటున్నారు. 

దీని గురించి కైరా మాట్లాడుతూ.. “ధోని సినిమా కంటే ముందే నేను ‘ఫగ్లీ’ చిత్రంలో నటించాను. ఆ సినిమా తర్వాత నాకు వేరే ఆఫర్లు రాలేదు. నా జీవితంలో అది చాలా క్లిష్టమైన సమయం. ఆ సమయంలో నేను.. అసలు నాకు రెండో ఛాన్స్‌ వస్తుందా? నా కెరీర్‌కు ఏమైంది? నాకు సినిమాల్లో నటించే అవకాశం వస్తుందా? రాదా? అని బాగా ఆలోచించేదాన్ని.నాకు ఏ సినిమా ఆఫర్లు అంత సులభంగా రాలేదు. ఆడిషన్స్‌ సమయంలో నన్ను కలవడానికి కూడా ఇష్టపడని వారు ప్రస్తుతం వాళ్ల సినిమాల్లో నాకు ఆఫర్లు ఇస్తున్నారు.’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కైరా ‘గుడ్‌ న్యూస్‌’, ‘లక్ష్మిబాంబ్‌’, ‘ఇండో కీ జవానీ’, ‘భూల్‌ భూలాయా2’ చిత్రాలలో నటిస్తున్నారు.